Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్  ప్రీ ప్రైమరీ పాఠశాలలో దరఖాస్తులకు ఆహ్వానం 

  ప్రీ ప్రైమరీ పాఠశాలలో దరఖాస్తులకు ఆహ్వానం 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రంపల్లి మండలంలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు నాలుగు మంజూరు కాబడ్డాయని ఉపాధ్యాయ, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు.  మండలంలో ప్రీ ప్రైమరీ ప్రాథమిక పాఠశాల కలిగోట్,ప్రాథమిక పాఠశాల పడకల్, ప్రాథమిక పాఠశాల అర్గుల్,ప్రాథమిక ఉన్నత పాఠశాల మనోహారాబాద్ ఈ పాఠశాలలో 4 టీచర్ పోస్టులు  నాలుగు ఆయా పోస్ట్లు మంజూరు కాబడ్డాయి. వీటికి స్థానికంగా ఉండే అర్హత గల ఉపాధ్యాయీనులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందిని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు.

కావున టీచర్ పోస్టుకు కనీసము ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి  టీచర్ ట్రైనింగ్ చేసిన వారు అర్హులు, అదేవిధంగా ఆయా పోస్టుకు ఏడవ తరగతి  ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు. ఇట్టి అర్హతలు గల అభ్యర్థుల నుండి అప్లికేషన్లను ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. వీరు మండల విద్యా వనరుల కేంద్రం జక్రం పెళ్లి నందు పదవ తారీకు లోపు దరఖాస్తు తో పాటు అర్హత గల సర్టిఫికెట్లను జత చేసి అందించగలరు. వివరాల కొరకు మండల విద్యాధికారి శ్రీనివాస్ ను సంప్రదించాలని ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -