సూర్యాపేట మీదుగా
కొనసాగించాలని డిమాండ్
నవతెలంగాణ – ఆత్మకూర్ ఎస్
శంషాబాద్ నుంచి చెన్నయ్‌కి వెళ్లే బుల్లెట్ ట్రైన్ లైన్‌ను ముందుగా ప్రకటించిన ప్రకారం సూర్యాపేట జిల్లా మీదుగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో సూర్యాపేట- దంతాలపల్లి ప్రధాన రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చడంలో జరిగిన కుట్రలను ఖండిస్తున్నామని, బుల్లెట్ రైలు సాధించేవరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తూడి నర్సింహారావు, అవిరే అప్పయ్య నర్సిరెడ్డి, జర్నలిస్ట్ లు భూపతి రాములు, మల్లేష్, గోవర్ధన్, కృష్ణ, రాము, సైదులు, రిటైర్డ్ డిఎం బయ్య మల్లికార్జున్, నాయకులు బత్తుల ప్రసాద్, దండ వెంకట్ రెడ్డి, గుండు రమేష్, బెల్లంకొండ యాదగిరి, గుంశావాలి, ప్రశాంత్, రామనర్సు గుండు రమేష్, కన్నయ్య, పందిరి మాదవరెడ్డి, నల్లగొండ నాగయ్య దానియెల్, సుందరయ్య, నర్సక్క, బాలాజీ, రాంరెడ్డి, నాగరాజు, లింగయ్య పాల్గొన్నారు.
బుల్లెట్ ట్రైన్ కోసం రాస్తారోకో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



