తెలంగాణకు రెయిన్ అలర్ట్…

నవతెలంగాణ – హైదరాబాద్:  హైదరాబాద్ వాతావరణ కేంద్రం రైతన్నలకు శుభవార్త చెప్పారు. నేటి నుంచి మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం నైరుతి రుతపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నాయి. ఈ పవనాలతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. నేడు నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్‌, పెద్దపల్లి, హన్మకొండ, సంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు.

Spread the love