వర్ష బీభత్సం

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు,లేచిపోయిన ఇంటి పైకప్పులు
నవతెలంగాణ-పుల్కల్‌
పుల్కల్‌ ఉమ్మడి మండల పరిధిలో ఆదివారం మధ్యా హ్నం వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో.. మండల పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. పలు ఇంటి పైకప్పులు విరిగిపడ్డాయి. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్‌ స రఫరా నిలిచిపోయింది. ఉమ్మడి మండల పరిధిలోని మి న్పూర్‌, కోడూర్‌, ఇసోజిపేట, గొంగుళూరు, గంగోజిపేట, తాడుదాన్‌పల్లి, శివంపేట, వెండికోల్‌, వెంకట కిష్టాపూర తదితర గ్రామాల్లో వర్షం అధికంగా కురిసింది. పలు గ్రామా ల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే తడిసిపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. అలాగే అకాల ఇండ్లు దెబ్బతిన్న నిరుపేదలకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Spread the love