Tuesday, July 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రజా సమస్యలను లేవనెత్తండి మీకు మేము అండగా ఉంటాం

ప్రజా సమస్యలను లేవనెత్తండి మీకు మేము అండగా ఉంటాం

- Advertisement -
  • సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపు
    నవతెలంగాణ-హైదరాబాద్: ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న వివిధ డిజిటల్ జర్నలిస్టులందరికీ తాము అండగా ఉంటామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. మంగళవారం సీపీఐ(ఎం) కార్యాలయం ఎంబీ భవన్లో టీ10 సీఈవో సుందర్ అధ్యక్షతన డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యమత్యంతో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని, రాజ్యాంగ పరి భాష వాడాలని సూచించారు. డిజిటల్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందర్నీ ఏకం చేసి, వారి పోరాటాలకు సీపీఐ(ఎం) మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఐక్యమత్యంతో ఉంటే ఏదైనా సాధించగలరని, నిరంతరం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విశ్లేషకులు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ తోపాటు వివిధ డిజిటల్ మీడియా ఛానళ్ల సీఈఓ లు, జర్నలిస్టులు వీడియో జర్నలిస్టులు హాజరయ్యరు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -