- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ కార్యకర్తల సమావేశం మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార, కామారెడ్డి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిలు పిలుపునిచ్చారు. సర్పంచ్ పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని వారు కోరారు. అనంతరం చిన్న ఎక్లారా సర్పంచ్ మాధవరావును వీరు సంయుక్తంగా సన్మానించారు. వీరితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా సన్మానించారు. తనను సన్మానించిన నాయకులందరికీ సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



