రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..

 – సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం , కుంభం శ్రీనివాస్ రెడ్డి..
నవతెలంగాణ- మునుగోడు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పెట్టుకున్న పొత్తు ధర్మాన్ని ప్రతి కార్యకర్త కాపాడాలని మునుగోడు లో సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సీపీఐ కార్యకర్తలకు సూచించారు. గురువారం మండలంలోని కొరటికల్ గ్రామంలో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా 27 పార్టీలతో దేశంలో ఇండియా కూటమి ఏర్పడిందని అన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీని అంతమొందించడానికి బీఆర్‌ఎస్‌ తో పొత్తు పెట్టుకున్నామని కానీ ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు ఏకమయ్యాయని దేశంలో బీజేపీని రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఓడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. ఈ కొరటికల్ గ్రామంలో పౌరుషానికి కరుడుగట్టిన కమ్యూనిస్టులు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన చరిత్ర ఈ కొరటికల్ గ్రామానికి చరిత్ర ఉందని అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ 200 దేశాలలో పార్టీ బలంగా ఉందని మనదేశంలో కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు పరిపాలన చేస్తున్నారని గుర్తు చేశారు. భారతదేశంలో పొత్తు లేకుండా పోటీ చేసే పార్టీలు లేవని అన్నారు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త నికార్సుగా కులం కుశంగా పనిచేయాలని, ఈ గ్రామంలో భారీ మెజార్టీ దిశగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని సూచించారు.
 కాంగ్రెస్ కార్యకర్తలు సీపీఐ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలని పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి అయితాడని ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్రం, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, సీపీఐ మండల సహాయ కార్యదర్శి మందుల పాండు, ఆ గ్రామ కార్యదర్శి మునుగోటి దయాకర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దండు లింగస్వామి, సీపీఐ కార్యకర్తలు మిరియాల యాదయ్య, కృపాటి లింగయ్య, రొమ్ముల యాదయ్య, అన్నం వెంకన్న, మందుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love