హర్యానా గవర్నర్ కు రాజన్న ప్రసాదం..

Rajanna Prasad to Haryana Governor..నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు(కే డిసిసి)అరుదైన గౌరవం దక్కింది,దేశవ్యాప్తంగా జరిగిన సహకార బ్యాంకు అవార్డుల ప్రధానోత్సవంలో కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ 9 సంవత్సరాల్లో, 8 సార్లు అత్యుత్తమైన బెస్ట్ అవార్డులను దక్కించుకుంది. చండీఘర్ రాజ్ భవన్ లో హర్యానా గవర్నర్ తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులు బండారు దత్తాత్రేయ, కేడీసీసీ బ్యాంకు పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎనిమిదవ సారి ఎంపికైన సందర్భంగా కేంద్ర హోమ్  శాఖ మంత్రి అమీషా చేతుల మీదుగా అవార్డును అందుకున్న సందర్భంగా సోమవారం హర్యానా వెళ్లిన బ్యాంక్ డైరెక్టర్లు రాజ్ భవన్ లో గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వక  కలిశారు. అనంతరం  పిఎ సిఎస్ చైర్మన్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని, రాజన్న శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ఈ గౌరవాన్ని పెంపొందించేలా  బ్యాంకు అధ్యక్షులు కొండూరు రవీందర్ రావు, వైస్ చైర్మన్  పింగిలి రమేష్, సీఈఓ సత్యనారాయణరావు  పాలకవర్గ సభ్యులందరినీ అభినందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో  పాలకవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు ఉచ్చిడి మోహన్ రెడ్డి, ముప్పాల రాంచందర్ రావు, సింగిరెడ్డి స్వామి రెడ్డి, నరేష్ రెడ్డి , రవీందర్ గౌడ్, శ్రీనివాస్, కృష్ణ ప్రసాద్, రమేష్ రెడ్డి, కమలాకర్, కోటి , సాగర్ , గోపాలరావు, సీఏ రమేష్, ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ హనుమంతరావు తోపాటు తదితరులు ఉన్నారు.
Spread the love