Sunday, May 24, 2026
E-PAPER
Homeఆటలురాజ‌స్థాన్ రాయ‌ల్స్ భారీ స్కోర్

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ భారీ స్కోర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వాంఖ‌డే స్ట్రేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవ‌ర్ల‌కు గాను 8 వికెట్లు కోల్పోయి 205 ప‌రుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన ముంబాయి ఇండియ‌న్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఆర్‌ఆర్ ఓపెన‌ర్లు జైస్వాల్ దూకుడుగా అడినా..23 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. భారీ హిట్ట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ కీల‌క‌పోరులో తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. కేవ‌లం 4 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. ఎంఐ బౌల‌ర్లు లైన్ అండ్ లెన్త్ బౌలింగ్ తో ప‌రుగుల క‌ట్ట‌డితో పాటు వికెట్లు తీశారు. దీంతో ప‌వ‌ర్ ప్లే ముగిసేరికి ఆర్‌ఆర్ 2 వికెట్లు కోల్పోయి 50 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన జురేల్(38), ప‌రాగ్(14), ఫెరీరా(18),శ‌న‌క‌(29) కొద్ది సేపు ఎంఐ బౌల‌ర్ల‌పై ఎదురు దాడికి దిగారు. వారి ధ‌నాధ‌న్ షాట్ల‌తో బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. దీంతో భారీ స్కోర్ దిశ‌గా ఆర్ ఆర్ దూసుకెళ్లింది. చివ‌ర్లో ఆర్చ‌ర్ 15 బంతుల్లో 32 ప‌రుగులు, జ‌డేజా 11 బంతుల్లో 19 ర‌న్స్ కొట్టారు. దీంతో ఎంఐకి 205 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్ధేశించారు. ఎంఐ బౌలర్లు శార్దుల్, చాహ‌ర్, రెండు వికెట్లు, బోట్, జాక్స్, గాజాప‌ర్ త‌లా ఒక వికెట్ తీశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -