- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్: టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు సందర్భంగా స్థానిక నాందేవాడలో ఎస్సీ స్టడీ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ నగర ఎస్సీ సేల్ ఆధ్వర్యంలో.. విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు పంపిణీ చేశారు. ఎస్సీ సేల్ నగర అధ్యక్షులు నాంది వినయ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మారం అవిన్, టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు గగన్, నగర మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ సర్దార్ నరేందర్ సింగ్, శంభుడిగుడి చైర్మన్ మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -



