రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకోవాలి… 

– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల- మాజీ ఎంపీపీ ఆరెల్లి 
నవతెలంగాణ-రామగిరి 
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన యువతి, యువకులు దరఖాస్తు చేసుకోవాలని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ రామగిరి మండల మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య  అన్నారు. ఈ సందర్భంగా వారు మాటాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతీ యువకులు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకం తీసుకు వచ్చిందని జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Spread the love