దేశానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల నాయకులు అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ గాంధీ దేశానికి అనేక సేవలు అందించారని కొనియాడారు.భారతదేశానికి అతి చిన్న వయస్సు 1984 లో ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ప్రధానమంత్రి హోదాలో దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకచ్చిన ఘనుడు రాజివ్ గాంధీ అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు శుభాష్ రెడ్డి , గుర్రము మోహన్ రెడ్డి,ఎంపీటీసీల ఫోరం మంచిర్యాల జిల్లా అధ్యక్ులు ఎండి రియజోద్దీన్,నాయకులు ఫసివుల్లా, ముత్యం రాజన్న,నర్సింగ్ రావు, గంగన్న యాదవ్,రాజన్న యాదవ్ , కోల పద్మారావు,పాత బాలరాజు,లకావత్ తిరుపతి, ఎండి అజార్,మంద రాజేష్, ఎం ఏ రజ్జాఖ్ , రాము,సౌడం రాజన్న, కలిమ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు అజ్జ్మత్ ఖాన్,తదితరులు పాల్గొన్నారు.