భారత దేశ ప్రధాన మంత్రిగా పరిపాలనలో గొప్ప సంస్కరణలు,విధానాలు అమలు చేసి రాజకీయాల్లో రాజీవ్ గాంధీ తనదైన ముద్ర వేశారని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్ ,నల్లగొండ ట్రస్మా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు లు కొనియాడారు.మంగళవారం మున్సిపల్ కేంద్రంలో బస్టాండ్ సమీపం వద్ద మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు అనంత చంద్రశేఖర్ గౌడ్ అధ్వర్యంలో రాజీవ్ గాంధీ 80 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంచుకొండ కీర్తి సంజయ్,కల్మికొండ జనార్దన్,నల్లగంటి మల్లేశ్, ఆంజనేయులు,బొమ్మరబోయిన సైదులు,సంకోజు బ్రహ్మం,పున్న ధర్మేందర్,ఐతరాజు మల్లేష్, పన్నాల లింగయ్య,గంజి వెంకటేశం,రాపోలు వెంకటేశం,జావిద్, కరింగు రవి, వెంకన్న,కర్నాటి శ్రీను,గంటకంపు అశోక్, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.