నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించినట్లు ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి తెలిపాడు. గురువారం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ భారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అన్నాడు. దేశాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత ఆయనకే చెల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్, యూత్ అధ్యక్షులు మది రాజేష్, నాయకులు నాయిని శ్రీపాల్ రెడ్డి, మల్లేశం, యాకుబ్ రెడ్డి, యాసం యాకన్న, వారిపెళ్లి పూర్ణచందర్, యుగేందర్, వెనం క్రాంతిరెడ్డి, కుమ్మరి కుంట్ల మౌనేందర్, వారి పల్లి పూర్ణ , ప్రవీణ్ జగన్ అఫ్రోజ్ బక్కి రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురులో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


