ఏఈడబ్ల్యుఎస్  సొసైటీ జిల్లా కార్యదర్శిగా రాకేష్ 

నవతెలంగాణ – మల్హర్ రావు
అల్ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 కాళేశ్వరం జోనల్ ఐదు జిల్లాల యువశక్తి అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్,ఉపాధ్యక్షుడుగా బండి సుధాకర్ సూచన మేరకు ఏఈడబ్ల్యుఎస్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శిగా మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన ఇందారపు రాకేష్ ను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక,రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నియామక పత్రాన్ని అందజేశారు.తమపై నమ్మకంతో ఈ పదవిని అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్,కుమార్ యాదవ్,బండి సుధాకర్ లకు రాకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ బాధ్యతపై అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీకి మంచి పేరు తీసుకవస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవైయు జిల్లా ఉపాధ్యక్షుడు కేశారపు సురేందర్  పాల్గొన్నారు.
Spread the love