ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ: మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి

నవతెలంగాణ – సూర్యాపేట
ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ అని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని ఆయన కొనియాడారు.కంప్యూటర్ ,టెలి కమ్యూనికేషన్ విప్లవం, పంచాయతీ రాజ్ వ్యవస్థ సాధికారత, రాజకీయాల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి విశిష్టమైన, చారిత్రక మరపురాని పనులు రాజీవ్ గాంధీ చేశారని పేర్కొన్నారు. అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా, తన దృక్పథంతో, దృఢ సంకల్పంతో దేశాభివృద్ధికి కొత్త ఊపు, దిశానిర్దేశం శక్తిని అందించారని తెలిపారు.18 సంవత్సరాల వయస్సు గల వారి ఓటు హక్కు, పంచాయితీలు, నగరపాలకుల రాజ్యాంగ సాధికారత, వారికి ఎన్నికలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. టెలికాం యుగంలోకి ప్రవేశించడం సామాజిక ఆందోళనలు  సవాళ్లను పరిష్కరించడానికి సైన్స్ & టెక్నాలజీని ఉపయోగించడం భారతదేశం  అణు కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం లాంటివి రాజీవ్ హయాంలో జరిగాయని వివరించారు.
1984లో ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైన తర్వాత రాజివ్ గాంధి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారని ఆ సంవత్సరం అక్టోబర్‌లో అధికారం చేపట్టినప్పుడు ఆయన 40 ఏళ్ల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి అయ్యారని తెలిపారు. రాజీవ్ గాంధీ భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి ఆనాడు చేపట్టిన కార్యాచరణలో భాగంగానే ఈరోజు భారతదేశం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించడానికి కారణమైందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం తేవడానికి కూడా నేరుగా ఢిల్లీ నుండి పల్లె వరకు నిధులను తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి , పల్లెలు బాగుండాలని ఆశించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం మన బాధ్యత అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కాపాడడానికి కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతగా పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అంజాద్ అలీ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, నాయకులు వీరన్న నాయక్,అబ్దుల్ రహిమ్,నరేందర్ నాయుడు, గోదాల రంగారెడ్డి, గడ్డం వెంకన్న, బైరు దుర్గయ్య,గాజుల రాంబయమ్మ, పద్మ,రాంబాబు, చెంచాల శ్రీనివాస్, మాణిక్యం,రెబల్ శ్రీను కోడి శివ,అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love