ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి:రమేష్ బాబు

నవతెలంగాణ కంఠేశ్వర్
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి కార్యాలయం వద్ద ఆశ వర్కర్ల ధర్నా నిర్వహించి శాసనసభ్యులు భూపతి రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా గత సెప్టెంబర్ నెలలో 15 రోజులపాటు సమ్మె చేసిన సందర్భంలో అప్పటి ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిందని, కానీ వాటి అమలుపట్ల చిత్తశుద్ధిగా వివరించలేదని. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం 18000  రూపాయలు ఫిక్స్డ్ గా నిర్ణయించేసి నెల 5వ తేదీ లోపు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హులైన ఆశా వర్కర్లను ఏఎన్ఎంలుగా ప్రమోషన్స్ సౌకర్యాన్ని ఇవ్వాలని, రికార్డులను ప్రభుత్వమే అందించాలని, ఆశా వర్కర్లకు సంబంధం లేని ఇతర పనులను అప్పగించకుండా పని భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మికుల  సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఆలోచించి, కనీస వేతనాలు అమలు జరిగి సౌకర్యాలను మెరుగుపరిచినప్పుడే వారు మనస్ఫూర్తిగా విధులు నిర్వహించి ప్రభుత్వానికి మరింత సేవలు అందించే పరిస్థితులు ఏర్పడతాయని లేనియెడల అశాంతి పెరిగి ఆందోళనలు నుంచే పరిస్థితులు వస్తాయని అందువల్ల ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కార్మిక సమస్యల పైన దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం మూలంగానే కార్మిక వర్గం ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కర్ల యూనియన్ నాయకులు సురేఖ, రమ, పద్మ, లక్ష్మి, లావణ్య తదితరులతో పాటు రూరల్ నియోజకవర్గం ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Spread the love