వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు

నవతెలంగాణ – సిద్దిపేట

పట్టణంలోని మోహినిపుర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా దేవాలయంలో స్వామివారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.  సాయంత్రం వెంకటేశ్వర స్వామినీ సూర్య నారాయణస్వామి అలంకరణతో రథోత్సవంపై మాడవీధుల గుండా తీసుకువెళ్లి భక్తులకు దర్శనమిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అమరేష్ విష్ణు, ఆలయ కార్య నిర్వహణ అధికారి విశ్వనాథ్ శర్మ , ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, వికాస తరంగిణి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Spread the love