ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి చెందిన కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమయ్యింది. దీని నిర్ణయాలను ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా జూన్ 5న ప్రకటించనున్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత వంటి అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఈ సమావేశం జరుగుతోంది. ద్రవ్యోల్బణ నష్టాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి కీలక బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే కాలానికి సంబంధించి ఆర్‌బిఐ ప్రకటించబోయే ద్రవ్యోల్బణ అంచనాలు, జీడీపీ వృద్ధి రేటు గమనం, రూపాయి అస్థిరతపై మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.


