విద్యుత్ ప్రజావాణి పై స్పందన..

– పలు సమస్యలు పై  వినతులు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్.పి.డి.సి.ఎల్ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశానుసారం ప్రారంభించిన విద్యుత్ ప్రజావాణిలో మొదటిరోజు సోమవారం పలు సమస్యలు పై వినతి పత్రాలు అందాయి. విద్యుత్ సంస్థ అశ్వారావుపేట సబ్ డివిజన్ పరిధిలోని అశ్వారావుపేట,దమ్మపేట రెండు మండలాలు లోని 10 సెంటర్లు నుండి 10 వినతులు అందాయని ఏడీఈ బి.వెంకటేశ్వర్లు తెలిపారు.అశ్వారావుపేట మండలం 8 సెంటర్ లు నుండి 8,దమ్మపేట మండలం 2 సెంటర్ లు నుండి రెండు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో అత్యధికం ట్రాన్స్ ఫారాలు సామర్ధ్యం పెంపు,శిధిలం అయిన పోల్స్,మిడిల్ పోల్ లు,బిల్ లో సమస్యలు పై అందాయని వివరించారు.
Spread the love