ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి: ఎస్ఎఫ్ఐ

నవతెలంగాణ – భువనగిరి
ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు నియంత్ర చట్టం తేవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి డిమాండ్ చేశారు గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలోఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు చింతల శివ అధ్యక్షతన నిర్వహించారు .ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రైవేటు విద్యాసంస్థలో అధిక ఫీజులు వసూలు చేస్తూ  ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ పర్మిషన్ లేకుండా విద్యాసంస్థాన్ని నడుపుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని,ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని,పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ అమాయక ప్రజల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యాసంస్థలు జిల్లాలో నడుపుతున్నారని డిమాండ్ చేశారు. ప్రైవేటు కార్పోరేటు ఫీజులను నియంత్రించాలని, పర్మిషన్ లేని విద్యా సంస్థలను మూసివేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 24 ,25 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశం  నిర్వహిస్తున్నామన్నారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విద్యార్థి ,ప్రజా సంఘాల నాయకులు ప్రముఖ విద్యావంతులు ,ప్రొఫెసర్లు హాజరై ఫీజుల నియంత్రణ చట్టం తేవాలన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోకుండా కాలయాపన చేసి, విద్యారంగాన్ని బస్టు పట్టించి , కార్పొరేట్లకు అప్పజెప్పిందఅప్పజెప్పిందన్నారు. ఈ ప్రభుత్వమైన విద్యారంగంపై దృష్టి పెట్టి ,ప్రకటనలకు కాకుండా ఆచరణలో  ఉండాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి మల్లేశం ,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు , జిల్లా సహాయ కార్యదర్శి వేముల నాగరాజు, ఈర్ల రాహుల్, ఉపాధ్యక్షులు కాసుల నరేష్, జిల్లా కమిటీ సభ్యులు బుగ్గ ఉదయ్ పాల్గొన్నారు.
Spread the love