Thursday, May 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంస్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయండి : ఇరాన్

స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయండి : ఇరాన్

- Advertisement -

టెహ్రాన్ : విదేశాలలో అమెరికా స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల టెహ్రాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ తరఫున చర్చలలో పాల్గొటున్న నేతలు, అధికారులు అమెరికాను కోరారు. ‘స్తంభింప జేసిన ఇరాన్ ఆస్తులను చర్చల సమయంలోనే విడుదల చేయాలి. పధ్నాలుగు సూత్రాల అవగాహనా ఒప్పందం ప్రకారం ఈ ఆస్తుల విలువ 24 బిలియన్ డాలర్లుగా అంచనా వేయడం జరిగింది’ అని విశ్వస నీయ వర్గాలను ఉటంకిస్తూ తస్నిమ్ వార్తా సంస్థ తెలియజే సింది. ఈ మొత్తంలో సగ భాగాన్ని అవగా హనా ఒప్పందం ప్రకటన సమయంలోనే అందుబాటులో ఉంచాలని ఇరాన్ పట్టుపడుతోంది. విదేశాలలో అమెరికా స్తంభిం పజేసిన ఇరాన్ ఆస్తుల విలువ ఎంత అనేది అధికారికంగా తెలియదు. అయితే ఇరాన్ మీడియా మాత్రం ఈ మొత్తం 100`123 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చునని అంచనా వేసింది. ఇదిలావుండగా శాంతి చర్చల నిమిత్తం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ గలీబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ హెమ్మాతీ ఇప్పటికే ఖతార్ చేరుకున్నారు.

ప్రతిపాదిత ఒప్పందంలో ఏముంది?
వివాదాల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించే అవగాహనా ఒప్పందంపై ఇరాన్, అమె రికా మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంతకీ ఆ ఒప్పందంలో ఉన్న అంశాలేమిటనే విష యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం…హార్ముజ్ జలసంధిని క్రమేపీ తెరుస్తారు. కీలక అంశాలపై చర్చించి తుది ఒప్పందానికి వచ్చేందుకు 60 రోజుల గడువును నిర్దేశించారు. వీటిలో ముఖ్యమైనది ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ అప్పగించాలి. ఆ నిల్వలను ఏం చేయాలనేది తదుపరి చర్చలలో నిర్ణయిస్తారు. కాగా విదేశీ బ్యాంకులలో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. తనపై గతంలో విధించిన ఆంక్షలను కూడా ఎత్తి వేయాలని పట్టుబడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను కూడా ఆపేయాలని అడుగు తోంది. ఇరాన్ వద్ద ఉన్న దూరశ్రేణి బాలిస్టిక్ క్షిప ణులను ధ్వంసం చేయాలని అమెరికా కోరుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -