సి.ఎస్.ఎన్.ఆర్ ప్రభుత్వ  కళాశాల కరపత్రం విడుదల

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోని సి ఎస్ ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వివిధ కోర్సుల కరపత్రాన్ని పిసిసి కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, ఆర్కే హాస్పిటల్ నిర్వహకులు డాక్టర్ రాజ్ కుమార్, పూర్వ విద్యార్థుల సంఘం కో కన్వీనర్ కొలుపుల వివేకానంద,  కళాశాల ప్రిన్సిపల్ డి.పాపిరెడ్డిలు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసి సభలో వారు మాట్లాడారు. భువనగిరి పట్టణానికి తలమానికమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో,  అనుభవ జ్ఞులైన అధ్యాపక బృందం, అధునాతన విశాలమైన క్రీడామైదానం, క్రీడా సామాగ్రి కలదన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, విద్యార్థులకు రూ. 8000 ఉపకార వేతనం లభించే అవకాశం ఉందన్నారు. బోధ న ఆంగ్లము తెలుగు మీడియాలలో కలదని తెలిపారు. వోకేషనల్ కోర్సులు   లైవ్ స్టాక్ మేనేజ్మెంట్& డైరీ టెక్నాలజీ, (  ఎల్ ఎం అండ్ డిటి), అకౌంటెన్సీ టాక్సిషన్, ఆటోమోబిల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, ఫార్మా టెక్నాలజీ, కోర్సులు ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శేక్ హమీద్ పాశ, ఏషాల అశోక్, వెంకట నరసింహారెడ్డి,  అధ్యాపకులు పాల్గొన్నారు.
Spread the love