రోడ్డుపై అక్రమంగా నిర్మించిన షెడ్డు తొలగింపు

Removal of illegally constructed shed on the roadనవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట పట్టణంలోని 28 వార్డులో నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ భూమి ఆక్రమించి గణేశుని మండపం పేరుతో షెడ్డు వేసిన ఓ ప్రజా ప్రతినిధి నోటీసులు పంపిన తొలగించకపోవడంతో మంగళవారం మున్సిపల్ సిబ్బంది అక్రమంగా నిర్మించిన అట్టి షెడ్డును తొలగించారు. ఈ సందర్భంగా అదే వార్డుకు చెందిన లింగంపల్లి అన్వేష్ మాట్లాడారు. ఇట్టి విషయం పై నేను, మా వార్డు స్థానికులు జమ్మికుంట మున్సిపల్ కమీషనర్ , టౌన్ ప్లానింగ్ ఆఫీసర్  లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.పలు మార్లు మున్సిపల్ సిబ్బందిని ఈ విషయం గురించి అడగగా వారికి సమయం ఇచ్చాము తీసి వేస్తామని అన్నార ని చెప్పారు. మూడు నెలలు గడిచిన ఆ షెడ్డు తొలగించక పోయే సరికి నేను మా యొక్క వార్డు కొంతమంది ప్రజలు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసామన్నారు. జిల్లా కలెక్టర్  సూచన మేరకు మున్సిపల్ సిబ్బంది ఆ షెడ్డును  తొలగించారన్నారు. దీనిని కొంతమంది ప్రజాప్రతినిధులు మతపరంగా వాడుకుంటు కమీషనర్ పై, మున్సిపల్ సిబ్బందిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం ఎవరికి చుట్టం కాదని అలాగే చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుందో నేటి అక్రమ షెడ్డు తొలగింపుతోనైనా కొంతమంది ప్రజాప్రతినిధులు అర్ధం చేసుకోవాలన్నారు. మా  వార్డు సమస్యను లేట్ అయినా సమస్యను పరిష్కరించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు, జమ్మికుంట మున్సిపల్ సిబ్బందికి మా యొక్క వార్డు ప్రజల తరుపున కృతజ్ఞతలు అని తెలిపారు.
Spread the love