ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించాలని కలెక్టర్ కు వినతి….

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రయివేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రెసిడెంట్ సూర్యనారాయణ రెడ్డి  పిలుపుమేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రయివేటు డిగ్రీ కళాశాలల యజమాన్యం  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతుకే జండగే   ప్రజావాణి లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా 2021-22 ,2022-23 ,2023-24  మాకు ఇవ్వ వలసిన ఫీజు రియంబర్స్ మెంట్ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయక పోవడం వల్ల మాకు కళాశాల నిర్వహణ భారంగా మారినదనారు.  గత సంవత్సరం ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసి ట్రెజరీ ద్వారా టోకెన్లు ఇచ్చినా  ఇంతవరకు ఆ టోకెన్ల డబ్బులు విడుదల కాకపోవడం వల్ల కళాశాలల నిర్వహణ కోసం తీసుకున్న అప్పులు, వడ్డీలు , అధ్యాపకుల జీతాలు , కళాశాల భవనాల అద్దెలు చెల్లించడంలో యాజమాన్యాలు తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, మా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని  మా జిల్లా ప్రధాన అధికారిగా ప్రభుత్వం ద్రుష్టి కి మా సమస్యను తీసుకువెళ్లి నిధులు విడుదల చేయించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో  మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిది డిగ్రీ అండ్ పీజీ కళాశాలల ట్రెజరర్ శ్రీ సాయి కృపడిగ్రీ అండ్ పీజీ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ శ్రీ హిందూ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ భాస్కరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ నలంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శంకర్ , జాగృతి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మణిపాల్ రెడ్డి,శ్రీ నవభారత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ , డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సురేందర్, ప్రగతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఈతప శ్రీశైలం, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బిసరి శ్రీశైలం పాల్గొన్నారు.
Spread the love