కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటించండి 

– మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలపై చార్జ్ షీట్ ప్రకటించండి 
– ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం: సీఐటీయూ
నవతెలంగాణ  – కంటేశ్వర్
కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటించండి అని మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలపై చార్జిషీట్ ప్రకటించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేస్తూ అదే విధంగా ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ అర్బన్ లో మున్సిపల్ జోనులవారీగా సమ్మేసనహాక సమావేశాలు నిర్వహిస్తూ కరపత్రాలు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు లు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధు జయప్రదం చేయాలని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని కొచ్చి పది సంవత్సరాలు పూర్తయినా, రైతంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. అనేక మోసపూరిత నినాదాలతో కాలం వెల్లదీసింది. బీజేపీ అధికారంలోకి, వస్తే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ అమలుకై నోచుకోలేదు. నిరుద్యోగం గత 50 గరిష్ట స్థాయికి చేరింది. కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించకపోవడంతో మున్సిపల్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కాంట్రాక్ట్,  ఔట్సోర్సింగ్ కార్మికులకు పని భద్రత ఉపాధి కరువైపోయింది. ధరలు నియంత్రిస్తామని వాగ్దానం చేసి, బీజేపీ ప్రభుత్వం హయంలోనే ధరలు కనీవినీ ఎరుగని రీతిలో 30 నుండి 55% వరకు పెరిగాయి. కార్మికుల్ని నియమిస్తే వారికి పిఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు అమలు చేయాలని, యూనియన్లు డిమాండ్ చేస్తాయనే ఆలోచనతో నర్సరీలు, పార్కులు, ట్యాంక్ బండ్స్, వైకుంఠ ధామం, హౌజ్ కీపింగ్, తదితర పనుల్లో డైలీవేజ్ కార్మికుల్ని నియమిస్తూ వారికి అన్యాయం చేస్తున్నది. ఇవి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలలో భాగమే. ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులంతా 2024 ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా  కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. కనీస వేతనం రూ.26,000/-లు, పెన్షన్ రూ.10,000/-లు, అందరికీ చెల్లించాలి. 4 లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ బిల్లు-2022ను రద్దు చేయాలి. ప్రభుత్వరంగ సంస్థల వాటాలు అమ్మడం, ప్రైవేటుపరం చేయడం ఆపాలి. కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. ధరల పెరుగుదలను అరికట్టాలి. ఆహార వస్తువులు, నిత్యావసరాల పై జిఎస్ టిని ఉపసంహరించాలి. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంట గ్యాన్పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ (సీడీఎన్) విస్తరింపచేయాలి. 14 ముఖ్యమైన వస్తువులు చేర్చి, దాని పరిధిని విస్తరించాలి. అట్టడుగు వర్గాలపై అణచివేతను అరికట్టాలి. సామాజిక న్యాయాన్ని కాపాడాలి. ప్రజా ఉద్యమకారులపై నిర్బంధాన్ని ఆపాలి. కేసులు ఎత్తివేయాలి. ఆంధ్రప్రదేశ్ మున్సివల్ కార్మికులకు చెల్లిస్తున్నట్లుగానే తెలంగాణలో కూడా రూ.21,000/-ల వేతనం చెల్లించాలి. మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలి. పారిశుద్ధ్య సేవల్లో ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించాలి. రాంకీ తదితర ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చెయ్యాలని కొత్తగా నియమించుకున్న కార్మికులను పాత కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలి. ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మికులకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. దహన సంస్కారాలకు రూ.30,000/-లు ఇవ్వాలి. ఆదివారాలు, పండుగ సెలవులు, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి. దీన్ని వాటర్ వర్క్స్ కార్మికులకు కూడా వర్తింపజేయాలి. మున్సిపల్ కార్మికులందరికీ మొదటి ప్రాధాన్యతనిచ్చి డబుల్ బెడ్రూం, ఇండ్లు, ఇళ్ళ స్థలాలు కేటాయించాలి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూపతి చంద్రశేఖర్ సూర రవి కృష్ణ, రమణారెడ్డి విక్రమ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love