
– ఎంపీఈఓ నియామకం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజల అవస్థలు వేళ బదిలీలు అనే శీర్షికన శనివారం నవతెలంగాణ లో ప్రచురితం అయిన కథనానికి అధికారుల నుండి స్పందన లభించింది. ఇక్కడ ఎంపీఈఓ సీతారామరాజు దీర్ఘకాలిక సెలవు పై వెళ్ళిన సంగతి పాఠకులకు విదితమే.ఈ క్రమంలో దుమ్ముగూడెం ఎంపీఈఓ ఎస్.ప్రసాద్ రావు ను అశ్వారావుపేట కు 15 రోజులు పాటు ఇంచార్జీ గా నియమించారు.ఆయన శనివారమే ఇక్కడ విధుల్లో చేరారు. ఇదిలా ఉండగా నియోజక వర్గానికి కేంద్రం అయిన అశ్వారావుపేట ఎంపీడీఓ సైతం ఈ నెల 31 నే పదవీవిరమణ చేయనున్నారు.ఈయన స్థానలో అయినా పూర్తి కాల పరిపాలనా పరం అయిన అనుభవం ఉన్న సీనియర్ అధికారిని రెగ్యులర్ నియమించాలని ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులను కోరుతూ న్నారు. అంతేగాకుండా మండలంలోనే ఏకైక మేజర్ పంచాయితీ కి సైతం కార్యదర్శి లేకపోవడం తో పాలన కుంటు పడే అవకాశం ఉందని వాపోతున్నారు.ఇక్కడ పని చేసిన కార్యదర్శి హరిక్రిష్ణ ఇటీవల బదిలీల్లో ఖమ్మం జిల్లాకు బదిలీ పై వెళ్ళారు.ఈయన స్థానంలోనూ మేజర్ పంచాయితీకి కార్యదర్శిని నియమించాలని పంచాయితీ వాసులు కోరుతున్నారు.