నవతెలంగాణ-కెరమెరి
గిరిజన పోరాటయోధుడు కుమురం భీం నడయాడిన పోరుగడ్డ జోడేఘాట్‌కు ఆర్టీసీ బస్సు పున:ప్రారంభమైంది. 2014 నుండి 2019 వరకు ఉదయం సాయంత్రం నడిచిన బస్సు ఐదు సంవత్సరాల నుండి రద్దయింది. పోరాట యోధుడు నడయాడిన గడ్డకు బస్సు లేకపోవడంతో ఐదు సంవత్సరాల నుండి ప్రయివేటు వాహనాలపై ఆధారపడుతూ ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన భీమ్ నూతన ఉత్సవ కమిటీ చైర్మన్ పెందూరు రాజేశ్వర్ పలు దఫాలుగా ఆర్టీసీ అధికారులు, నాయకులకు సమస్యను వివరించగా డిపో మేనేజర్ విశ్వనాధ్ స్పందించి శుక్రవారం బస్సు జోడేఘాట్‌లో ప్రారంభించారు. దీంతో జోడేఘాట్, చాల్‌బడి, బాబాజేరితో పాటు పలు ఆదివాసీ గూడాలకు ఉపయోగకరంగా మారనుంది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ విశ్వనాథ్ మాట్లాడుతూ జోడేఘాట్‌కు రెండు పూటలు బస్సు నడుస్తుందనిఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో భీం మనవడు సోనేరావు, నాయకులు మారుతి, మారు, రాజు, లక్ష్మణ్, కనక ప్రభాకర్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.