రాహిల్‌ బెయిల్‌ రద్దు చేయండి

– హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన పోలీసులు
నవతెలంగాణ-హైదరాబాద్‌
జాబ్లీహిల్స్‌లో హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడిగా ఉన్న బోధన్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌కు హైకోర్టు గతంలో జారీ చేసిన మధ్యంతర బెయిల్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌పై వాదనలు పూర్తి కావడంతో సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని బి.విజయసేన్‌రెడ్డి చెప్పారు జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదం కేసులో ఓ చిన్నారి మరణించింది. అయితే, ఆ ప్రమాద సమయంలో తాను కారు నడుపుతున్నట్టు ఒక వ్యక్తి లొంగిపోయాడు. ఈ కేసులో రాహిల్‌ హైకోర్టు నుంచి బెయిల్‌ పొందడాన్ని పోలీసులు సవాల్‌ చేశారు. వ్యాజ్యంపై వాదనలు ముగియడంతో ఉత్తర్వులు సోమవారం జారీ చేస్తామని జడ్జి ప్రకటించారు.

Spread the love