విజయ యాత్రకు అనుమతించండి..

నవతెలంగాణ -హైదరాబాద్‌
నిర్మల్‌, ఖానాపూర్లో వీర హనుమాన్‌ విజయయాత్ర నిర్వహణకు షరతులు విధించి అనుమతి ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ‘ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ర్యాలీ నిర్వహించాలి. వంద బైక్‌లకు మాత్రమే అనుమతివ్వాలి. డీజే సౌండ్స్‌ వాడకూడదు. మత, రాజకీయ అంశాలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు’ అని షరతులతో అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. వీహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు పైవిధంగా అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Spread the love