ప్రభుత్వ హామీని తుంగలో తొక్కిన రైస్ మిల్లర్ యజమానులు

నవతెలంగాణ – తొగుట 
ధాన్యం కొనుగోలు నిలిపివేయడం పట్ల రైతులు రాస్తారోకో చేశారు. సోమవారం మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రంలో  వరి ధాన్యం కొనుగోలు నిలిపివేయడం పట్ల రైతు లు రాస్తారోకో చేపట్టారు. ఆరు గాలం పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతన్న అష్ట, కష్టాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు వల్ల రైతుల కష్టం వర్ణనాతీతం. అధికారులు, నాయకులు, ప్రజా పాలన అని చెప్పుకొని పట్టించుకోవడం లేదని ఆవే దన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతన్నల సమస్య లను, బాధలను అర్థం చేసుకొని ధాన్యం కొనుగో లు వేగవంతం చేయాలన్నారు. కొనుగోలును తక్ష ణమే సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొంటా మని ప్రభుత్వం చెప్పిన హామీని రైస్ మిల్లర్ యజ మానులు తుంగలో తొక్కి క్వింటాల్ వరి ధాన్యానికి నాలుగు కిలోల తరుగు ఇస్తేనే ధాన్యాన్ని తీసుకుం టామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు, పాలకులు వెంటనే స్పందించి రైతు లను ఆదుకోవాలని కోరారు.
Spread the love