Sunday, May 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅంకాపూర్ శివారు వద్ద రోడ్డు ప్రమాదం

అంకాపూర్ శివారు వద్ద రోడ్డు ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్: మండలంలోని అంకాపూర్ గ్రామం శివార్లలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఒక కారును, అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదం ధాటికి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -