పాతుకపోయిన ఎంపీడీవో

– 9 ఏళ్లుగా ఒకే దగ్గర విధులు
– అభివృద్ధికి నోచుకోని గ్రామాలు, పేరుకపోతున్న సమస్యలు

– దృష్టి పెట్టని పంచాయతీ అధికారులు

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలో ఎంపీడీవో అధికారిగా విధులలో కొనసాగుతున్న అధికారి మండల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులకు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులతో స్వచ్ఛర  సంబంధ పరిచయాలు ఏర్పడి గ్రామాలలో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం లోపించి రోజు రోజుకి సమస్యలు పెరిగి గ్రామాలలో పనులు కుంటుపడుతున్నట్టు దర్శనమిస్తున్నాయి. మండల స్థాయి గెజిటెడ్ అధికారి మూడు సంవత్సరాలు ఓకే దగ్గర వీధులలో కొనసాగితే బదిలీలపై ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్లు చేస్తుంటారు. గతంలో వేరే జిల్లాకు బదిలీ అయినా రెండు నెలలకు మళ్లీ ఉప్పునుంతల మండలానికి పోస్టింగ్ ఇప్పించుకున్నట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ ఉప్పునుంతల మండలంలో 9 సంవత్సరాల నుండి ఓకే కార్యాలయంలో కొనసాగుతున్న ఈ అధికారి పట్ల మండల స్థాయి ఇతర అధికారులు కూడా బదిలీ కాకపోవడంపై ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు. గ్రామాలలో కాలనీలో మురుగునీరు, పారిశుద్ధ్యం, శానిటైజర్, ఏళ్లు గడిచిన గ్రామసభ నిర్వహించకపోవడం పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నట్లు ప్రజలు, ప్రజా సంఘాలు, యువత గ్రామాలలో నెలకొన్న సమస్యల పట్ల స్పందించని అధికారి తీరు పట్ల ప్రజలు చర్చించుకుంటూ అసహనంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మండలాలలో ఎంపీడీవోలు బదిలీ కాగా ఉప్పునుంతల ఎంపీడీవో బదిలీ కాకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, కొందరు ఐదు నెలలలో రిటైర్మెంట్ ఉన్నందుకే బదిలీ లేదేమో అన్నట్లుగా భావిస్తున్నారు. సంబంధిత శాఖ జిల్లా అధికారులు స్పందించి విధులను నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల, స్పెషల్ ఆఫీసర్ ల తీరుపై పూర్తి పర్యవేక్షణ కొనసాగించి గ్రామలలో నెలకొంటున్న సమస్యల పట్ల ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా కార్యకలాపాలు రూపొందించి అభివృద్ధికి బాటలు వేసి కృషి చేయాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love