కాంగ్రెస్ అధికారంలోకి  రాగానే రూ.2లక్షల రుణమాఫీ

 – 24 గంటలు వ్యవసాయానికి కరెంట్

 – నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు
 – కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు పేదోడికి వారంటీలు
 – మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ- మల్హర్ రావు:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటల కరెంట్, మంథని నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తానని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్  మేనిపేస్టో చైర్మన్,మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు హమీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ఆన్ సాన్ పల్లి, నాచారం, ఇప్పలపల్లి, కొయ్యుర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజలను మభ్య పెడుతు పబ్బం గడుపుతున్న కేసీఆర్ ప్రభుత్వం మాయ మాటలు నమ్మి  మళ్ళీ  మోసపోవద్దన్నారు.-కాళేశ్వర ప్రాజెక్ట్ పేరిట  లక్ష కోట్ల రూపాయలు దోసుకున్నారని, ఇటీవల కేంద్ర బృందం వచ్చి రిపోర్ట్ ఇచ్చారని, మేడిగడ్డ కూలిపోయో ప్రమాధం ఉoదన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రధానమంత్రి మోడీ , కేసీఆర్ నోరు విప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నిత్యావసర ధరలు పెరిగినాయని, కాంగ్రెస్ హయంలో రూ.185 ల కే అమ్మ హస్తం పేరిట  నిత్యవసర సరుకులు అందజేసినట్లుగా తెలిపారు. ఇప్పుడు రేషన్ షాప్. బియ్యం షాప్ ఐపోయింది కేవలం బియ్యం మాత్రం మే పోస్తున్నరని,-కాంగ్రెస్ రాగానే సన్న బియ్యం, అర్హులకు రేషన్ కార్డులు, పార్టీలకతితంగా ఇస్తామన్నారు. కాంగ్రెస్ పభుత్వం రాగానే రైతులకు సబ్సిడీ అందజేస్తామని, సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తుందని,రూ. 500 కే గ్యాస్ సిలిండర్ మహిళలకు  బస్సు ప్రయాణం ఉచితంగా అమలు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలు, మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల 2,500, 500రూ ల కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసాగా 2 లక్షల రుణమాఫీ ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఏకరానికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000రూ,వరి పంటకు రూ.500 బోనస్ గృహ జ్యోతి క్రింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, యువ వికాసం క్రింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ వృద్ధులకు వితంతులకు రూ.4000 నెలవారీ పింఛన్,రూ.10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ప్రతినెల రూ.4 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. -అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే చేస్తుందన్నారు.
-రైతులకు మెరుగైన  కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కి ఉందన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్తును కాంగ్రెస్ ప్రభుత్వమే అందించిందనీ అన్నారు.కరెంటు సమస్యలు రాకూడదని భావించి జైపూర్ విద్యుత్ ప్లాంట్తో పాటు భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ విభజన చట్టంలో క్రిటికల్ అలీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.ప్రభుత్వం రాగనే ఇక్కడ ఒక్క లిఫ్ట్ ఏర్పాటు చేసి రైతు లకి నీరు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ ఎంపిపి ఐస్నపు రవి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, ఎస్సిసేల్ అధ్యక్షుడు దండు రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, సర్పంచ్ లు జగన్ నాయక్, జనగామ స్వరూప బాపు, ఎంపిటిసి ఏనుగు నాగరాని, నాయకులు జంగిడి శ్రీనివాస్,రాజైలు,దేవేందర్, సమ్మయ్య,పాల్గొన్నారు.
Spread the love