Monday, June 8, 2026
E-PAPER
Homeఆటలుతిలక్‌ వర్మకు రూ.33 లక్షలు

తిలక్‌ వర్మకు రూ.33 లక్షలు

- Advertisement -

సివీ మిలింద్‌కు 17 లక్షలు, సిరాజ్‌కు 14 లక్షలు
క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించిన టీజీ20 ఆటగాళ్ల వేలం

నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌ క్రికెట్‌లో సరికొత్త అంకం. టీజీ20 ఆటగాళ్ల వేలంలో ప్రాంఛైజీలు క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించాయి. దిగ్గజ క్రికెటర్లలో తిలక్‌ వర్మ రూ.33 లక్షలు (మెదక్‌ ఫాల్కన్స్‌) దక్కించుకోగా.. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ రూ.14 లక్షలు (వరంగల్‌ వారియర్స్‌), సివీ మిలింద్‌ రూ.17 లక్షలు ( ఖమ్మం ఏసెస్‌) వేలంలో అత్యధిక ధర సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని రామోజి ఫిల్మ్‌సిటీలో ఆదివారం జరిగిన ఆటగాళ్ల వేలంలో 1300 మంది క్రికెటర్లు అదృష్టం పరీక్షించుకోగా.. 8 ప్రాంఛైజీలు 160 మంది క్రికెటర్లను కొనుగోలు చేశాయి. హెచ్‌సీఏ తరఫున రాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచిన ప్రాంఛైజీలు..  ఆ తర్వాత లీగ్‌ దశలో, జిల్లాల తరఫున ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్లను తీసుకునేందుకు ఆసక్తి చూపించాయి.  అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్‌గా సీవీ మిలింద్‌ నిలిచాడు. దినవతెలంగాణ-హైదరాబాద్‌గ్గజ ప్లేయర్ల జాబితా నుంచి మాజేటి రవి కిరణ్‌ రూ.13 లక్షలు (పాలమూరు స్ట్రయికర్స్‌), టి రవిజేత రూ.12 లక్షలు (మెదక్‌ ఫాల్కన్స్‌), తనయ్‌ త్యాగరాజన్‌ రూ. 11 లక్షలు (రంగారెడ్డి రైజర్స్‌), రాహుల్‌ బుద్ది రూ. 8 లక్షలు (నల్గొండ నైట్స్‌), తన్మయ్‌ అగర్వాల్‌ రూ.8 లక్షలు (కరీంనగర్‌ డైమండ్స్‌), కొలగాని రోహిత్‌ రాయుడు రూ.6.5 లక్షలు (పాలమూరు స్ట్రయికర్స్‌) వేలంలో మంచి ధర దక్కించుకున్నారు. ఏ ప్లస్‌ విభాగంలో ఆమన్‌ రావు రూ.12 లక్షలు (వరంగల్‌ వారియర్స్‌), ఎం. సాయి ప్రజ్ఞయ్‌ రెడ్డి రూ.11 లక్షలు (పాలమూరు స్ట్రయికర్స్‌), గంగపురం అజయ్‌ దేవ్‌ గౌడ్‌ రూ.11 లక్షలు (హైదరాబాద్‌ ఈ చాంపియన్స్‌), నోముల నితిన్‌ సాయి యాదవ్‌ రూ.9 లక్షలు (రంగారెడ్డి రైజర్స్‌), ఆరోన్‌ జార్జ్‌ రూ.7.5 లక్షలు (రంగారెడ్డి రైజర్స్‌), రక్షణ్‌ రెడ్డి రూ.6 లక్షలు (నల్గొండ నైట్స్‌)లు వేలంలో ప్రాంఛైజీలను ఆకర్షించారు. ఏ కేటగిరీ నుంచి అభిరాత్‌ రెడ్డి రూ. 11 లక్షల ధరకు హైదరాబాద్‌ ఈ చాంపియన్స్‌ సొంతమవగా.. అర్ఫాజ్‌ అహ్మద్‌ సైతం రూ. 11 లక్షలకు నల్గొండ నైట్స్‌ గూటికి చేరాడు.

తిలక్‌కు రికార్డు ధర
దేశవాళీ టీ20 లీగ్‌లలో తిలక్‌ వర్మ రికార్డు ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (డీపీఎల్‌)లో సిమర్‌జిత్‌ సింగ్‌ రూ.39 లక్షలు దక్కించుకున్నా… అక్కడి వేలంలో ప్రాంఛైజీ పర్సు విలువ రూ. 1.5 కోట్లు. టీజీ20లో ప్రాంఛైజీల పర్సు కేవలం రూ. 60 లక్షలు. అయినా, తిలక్‌ వర్మ ఏకంగా రూ.33 లక్షల రికార్డు దక్కించుకున్నాడు. యూపీ టీ20 లీగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ రూ.30.25 లక్షలు, తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో ఆర్‌. సాయి కిశోర్‌ రూ. 22 లక్షలు, కర్ణాటక టీ20 లీగ్‌లో కరుణ్‌ నాయర్‌ రూ.18 లక్షలు, బెంగాల్‌ ప్రొ టీ20 లీగ్‌లో షాజాబ్‌ అహ్మద్‌ రూ. 12.2 లక్షలు, ముంబయి టీ20 లీగ్‌లో అథర్వ రూ.16.25 లక్షలతో అత్యధిక ధర దక్కించుకున్నారు.  టీజీ20 తొలి సీజన్‌ ఈ నెల 21 నుంచి ఆరంభం కానుంది. 8 జట్లు పోటీపడుతున్న ఈ టీ20 లీగ్‌లో 21 రోజుల పాటు 32 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు సహా అన్ని మ్యాచ్‌లకు ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -