లావా మొట్టమొదటి రింగ్ లైట్ తో బ్లేజ్ 2 5జి ని ఎంఆర్పి రూ. 9,999/- కు ప్రవేశపెట్టింది · ప్రీమియం డిజైన్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ, బ్లేజ్ 2 5జి ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ & రింగ్ లైట్ తో అందుబాటులో ఉంటుంది · >3,90,000 AnTuTu తో మెరుపు వేగం కలిగిన మీడియాటెక్ డైమెన్సిటి 6020 ప్రీసెసర్ ఉంది · బ్లేజ్ 2 5జి లో 90 Hz రిఫ్రెష్ రేట్ తో 16.55 సెంమీ (6056”) హెచ్డి+ ఐపిఎస్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంది · బ్లేజ్ 2 5జి రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది (RAM/ROM )–(4+4*)జిబి/64జిబి మరియు (6+6*)జిబి/128జిబి కొత్త ఢిల్లీ, నవంబరు 2, 2023: పోటీ ధర వద్ద కట్టింగ్-ఎడ్జ్ ఫీచర్స్ అందించాలనే తన సిద్ధాంతానికి కట్టుబడి, లావా ఈరోజు కొత్త బ్లేజ్ 2 5జి ఫోన్ ను రూ. 9,999/- కు ప్రవేశపెట్టింది. ఈ పరికరము ప్రీమియం గ్లాస్ బ్యాక్ మరియు విభాగములో మొట్టమొదటి రింగ్ లైట్ తో వస్తుంది. ఇది 3 ప్రకాశవంతమైన రంగులలో, గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ & గ్లాస్ లావెండర్ రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ తాజా స్మార్ట్‌ఫోన్ లో 3,90,000 కంటే ఎక్కువ AnTuTu స్కోర్ తో మెరుపు-వేగము కలిగిన మీడియాటెక్ డైమెన్సిటి 6020 ప్రాసెసర్ ఉంది. బ్లేజ్ 2 5జి రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది (RAM/ROM ) – (4+4*) జిబి/64జిబి మరియు (6+6*) జిబి/128జిబి యూఎఫ్ఎస్ 2.2 మెమొరీ, 1 టిబి వరకు విస్తరించదగినది. ఇందులో 2.5డి కర్వ్డ్ స్క్రీన్ మరియు 90 Hz రిఫ్రెష్ రేట్ తో 16.55 సెంమీ (6.56”) హెచ్డి+ ఐపిఎస్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. బ్లేజ్ 2 5జి క్లీన్ ఆండ్రాయిడ్TM 13 అనుభవాన్ని అందిస్తుంది.
నో యాడ్స్, నో బ్లోట్‌వేర్ తో వస్తుంది. ఇది అనామక మరియు ఆటో కాల్ రికార్డింగ్ కూడా అందిస్తుంది. ఒక సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 అప్గ్రేడ్ కు, రెండు సంవత్సరాల త్రైమాసిక భద్రతా అప్డేట్స్ వాగ్ధానం ఇస్తుంది. బ్లేజ్ 2 5జి లో ఖచ్ఛితమైన సెల్ఫీల కొరకు స్క్రీన్ ఫ్లాష్ తో 50ఎంపి వెనుకవైపు కెమెరా మరియు 8 ఎంపి ముందువైపు కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్ లోని ఇన్‌బిల్ట్ కెమెరా ఫీచర్స్ లో ఫిల్మ్, స్లో మోషన్, టైమ్ లాప్స్, యూహెచ్‌డి, జిఐఎఫ్, అందము, హెచ్‌డిఆర్, నైట్ పోట్రెయిట్, ఏఐ, ప్రో, పానోరమ, ఫిల్టర్స్ మరియు ఇంటలిజెంట్ స్కానింగ్ వంటి వివిధ మోడ్స్ ఉన్నాయి. బ్లేజ్ 2 5జి, 5000 mAh బ్యాటరీ మరియు 18W వేగవంతమైన చార్జింగ్ (టైప్-సి) లతో వస్తుంది. ఉత్తమమైన అమ్మకాల-అనంతర వినియోగదారు అనుభవము కొరకు, వినియోగదారులకు ‘ఉచిత ఇంటివద్ద సేవ’ అందించబడుతుంది, ఈ సేవలో సేవ వినియోగదారు ఇంటివద్దనే అందించబడుతుంది (వినియోగదారులు ఈ సేవను ఫోన్ యొక్క వారెంటీ కాలములో ఉపయోగించుకోవచ్చు). ఇంటివద్ద సేవను అందుకొనుటకు, ఇక్కడ క్లిక్ చేయండి: https://www.lavamobiles.com/lava_service_at_home/ బ్లేజ్ 2 5జి భారతదేశవ్యాప్తంగా లావా వారి రీటెయిల్ నెట్వర్క్, Amazon.in, Lavamobiles.com పై అందుబాటులో ఉంటుంది. ధర మరియు అందుబాటు: