దీక్ష దివస్ ను విజయవంతం చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Diksha Divas should be made a success: RS Praveen Kumarనవతెలంగాణ – కామారెడ్డి
ఈనెల 29 శుక్రవారం న కామారెడ్డి జిల్లా కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దీక్ష దివస్ ను నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం  కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన జిల్లా  బి ఆర్ ఎస్ పార్టీ సమావేశానికి ఆయన సభ పరిశీలకులుగా కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీక్ష దివాసును ఘనంగా జరపాలని బిఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్  సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చేపట్టిన దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త ఈ సమావేశానికి రాకపోయినా ఎక్కడ ఉన్నా అక్కడ ఈ దీక్ష దివాసును జరుపుకోవాలని అన్నారు. నాడు కెసిఆర్ పోరాటం చేయకుంటే ఇప్పటికీ ఆంధ్ర పాలకుల కబంధహస్త్రాల్లోనే తెలంగాణ ఉండేది అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి రైతులకు, సామాన్య ప్రజలకు సేవ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  కామారెడ్డి,కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజుల సురేందర్, బిఆర్ఎస్  పార్టీ జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దిన్,  ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Spread the love