ఆర్టీసీ బస్సు టైర్ పగిలి నలుగురికి తీవ్ర గాయాలు

ఆర్టీసీ బస్సు టైర్ పగిలి నలుగురికి తీవ్ర గాయాలునవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ :
ఆర్టీసీ బస్ టైరు పగిలి నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న టీస్ 02 యు ఏ 2602 ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు రెండు బ్లాస్ట్ అయ్యయి. దీంతో బస్సులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గోదావరిఖనికి చెందిన ఇద్దరు, అక్కనపేట మండలంలోని కుందన వాని పల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరికి గాయాలు కాగా హుస్నాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయాలైన ప్రయాణికులను మెరుగైన వైద్య కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Spread the love