వైన్ షాప్ నిర్వాహకుల..? నిబంధనల అగంతకుల..!

– నెలలు గడుస్తున్న జిపి పర్మిషన్ తీసుకొని వైనం
– లిక్కర్ బాసుల తీరుతో జిపి ఆదాయానికి గండి..
నవతెలంగాణ – రాయపర్తి
వైన్ షాప్ నిర్వాహకుల లేక ప్రభుత్వ నిబంధనల అగాంతకుల అన్నట్లుగా ఉంది, మండల కేంద్రంలోని వైన్ షాపుల నిర్వాహకుల వ్యవహారం. మండల కేంద్రంలో అక్షయ, కార్తీక్, వెంకటేశ్వర అనే మూడు వైన్ షాపులు ఉండగా నిర్వాహకులు స్టిక్కర్ చాటున లిక్కర్ దందాను ప్రొఫెషనల్ ఎక్సైజ్ అధికారుల కనుసన్నుల్లో జోరుగా సాగుతుందనేది ఓపెన్ సీక్రెట్. ఇదిలా ఉండగా రెండు నెలలు ముగిసినప్పటికీ కూడా వైన్ షాప్ నిర్వాహకులు రాయపర్తి గ్రామపంచాయతీలో పర్మిషన్ తీసుకోకపోవడం శోచనీయం. ఫండమెంటల్ రూల్స్ ప్రకారం గ్రామపంచాయతీలో ట్రేడ్ లైసెన్స్ తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలి. అలాంటిది నెలలు గడుస్తున్న లిక్కర్ బాసులు నియంతల ప్రవర్తిస్తూ గ్రామపంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారు. 2020 – 2021 ఫండమెంటల్ ప్రభుత్వ నిబంధన ప్రకారం  సంవత్సరంలో వచ్చిన నికర ఆదాయం నుండి 15 శాతం పన్ను గ్రామపంచాయతీకి చెల్లించవలసి ఉంది. అలాంటిది మూడు వైన్ షాపుల నిర్వాహకులు సిండికేటై లిక్కర్ దందా చూసుకుంటున్నారే తప్ప గ్రామపంచాయతీ పర్మిషన్ తీసుకున్న పాపాన పోలేదు. ఈ విషయంపై నవతెలంగాణ గ్రామపంచాయతీ కార్యదర్శి బెటపెళ్లి రాకేష్ ను వివరణ కోరగా… రెండు నెలలు గడుస్తున్న వైన్ షాప్ నిర్వాహకులు గ్రామపంచాయతీలో పర్మిషన్ తీసుకోలేదు. ఈ విషయంపై నిర్వాహకులకు రెండుసార్లు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైన్ షాప్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని ఉపోద్ఘాటించారు. వైన్ షాప్ నిర్వాహకుల తీరుపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో వైన్ షాప్ నిర్వాహకుల ఆగడాలు ఆగుతాయా లేక మరింత ఉద్రిక్తం అవుతాయో చూడాలి.
Spread the love