
– వెట్టి చాకిరీ చేయిస్తున్న కేంద్రం
నవతెలంగాణ -పెద్దవూర
గ్రామీణ డాక్ సేవకుల (జిడిఎస్)కు సంబంధించిన వివిధ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఎఐజిడిఎస్‌యు డిసెంబరు 12 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. డాక్ సేవక్‌లకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించి ఎనిమిది గంటల డ్యూటీ, బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. 12, 24, 36 ఏళ్ల సర్వీసు పూర్తయితే మూడు ఫైనాన్షియల్ అప్‌గ్రేడ్‌లు మంజూరు చేయాలని, గ్రాట్యుటీగా 1.5 లక్షలకు బదులుగా 5 లక్షలు అందించాలని, ఏడాదికి 30 రోజుల సెలవులు మంజూరు చేయాలని, 180 వరకు నిరుపయోగంగా ఉన్న సెలవులను కూడబెట్టాలని డిమాండ్ చేస్తూ పెద్దవూర మండలం లో సబ్ పోస్తాఫిసు ముందు ధర్నా డాక్ సేవకులు గత మూడు రోజులు గా ధర్నా నిర్వహిస్తున్నారు.పి ఎం కిసాన్ యోజన, ఆసరా పింఛన్లపంపిణి, రిజిస్టర్ పోస్టు ఉత్తరాలు, స్పీడ్ పోస్టులు, ఎన్ఆర్ఈజీఎస్ పేమెంట్, వంటి రకాల పనులు చేయించు కుంటూ వారితో వెట్టి చాకిరీ చేయించు కుంటున్నారు. జీడిఎస్ లను పర్మినెంట్ చేయాలని పెద్దవూర మండలం లో ధర్నా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ డాక్ సేవక్ మండల అధ్యక్షులు ఎండి జానిమియా, మల్లేశ్వరి, అనంతశర్మ, శ్రీనివాస్, సమర సింహ్మ రెడ్డి, సందీప్, లోకేష్, సౌజన్య, మాదవి, భానుమతి తదితరులు వున్నారు.