రోడ్డు ప్రమాదంలో గ్రామీణ వైద్యుడు సాంబయ్య కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో గ్రామీణ వైద్యుడు సాంబయ్య కు తీవ్ర గాయాలు– పరామర్షించిన జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్
నవ తెలంగాణ మల్హర్ రావు.
తెలంగాణ ఆర్ఎంపీ,పీఎంపీ వెల్పేర్ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా గౌరవ అధ్యక్షుడు,సీనియర్ గ్రామీణ వైద్యుడు ఎరుకొండ సాంబయ్య ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆదివారం రేందు కాళ్లకు తీవ్రమైన గాయలైయ్యాయి.భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ చౌరస్తాలో రోడ్డు దాటుతున్న నేపథ్యంలో లారీ ఢీకొనడంతో రెండు కాళ్ళు పాదాలపై తీవ్రమైన గాయాలైన సాంబయ్య హన్మకొండలోని గార్డెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.విషయం తెలుసుకున్న తెలంగాణ ఆర్ఎంపి,పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్, అధికారప్రతినిది చేవూరి రాజేందర్ లు పరమార్షించి,అదైర్య పడవద్దు,యూనియన్ అండగా ఉంటుందన్నారు.ఆసుపత్రి వైద్యులను కలిసి సాంబయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Spread the love