రైతుబంధు డబ్బులు ఇవ్వని యూనియన్ బ్యాంక్ మేనేజర్

– ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన రైతు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ఆర్మూరు మండలం అంకాపూర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ రైతుబంధు డబ్బులు ఇవ్వడం లేదని, జక్రాన్ పల్లి మండలం ముని పల్లి గ్రామానికి చెందిన కోలి ప్యాక్ సాయి రెడ్డి తండ్రి పెద్ద సాయన్న సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు సాయి రెడ్డి మంగళవారం తెలిపారు. మండలంలోని ముని పెళ్లి గ్రామానికి చెందిన కొలి ప్యాక్ సాయి రెడ్డి యొక్క బ్యాంకు పొదుపు ఖాతా అంకాపూర్ యూనియన్ బ్యాంకులో ఉంది. 2020 సంవత్సరంలో క్రాప్ లోన్ రెన్యువల్ చేయించడానికి జమన త్ దారుని తీసుకొని పోయి బ్యాంక్ మేనేజర్ ను అడగగా, అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఇంకా టైం ఉన్నదని అన్నారని అన్నారు. అనుకోకుండా బ్యాంకులు బంద్ వచ్చిన మరలా బ్యాంకు వర్కింగ్ డే లో జమానత్ దారున్ని తీసుకొని పోతే టైం అయిపోయిందని బ్యాంక్ మేనేజర్ తెలిపారని అన్నారు. కావున తీసుకున్న రుణం రూ.60000 రూపాయలు  ఇట్టి రూపాయలకు వడ్డీ రూ.44 వేల 473 రూపాలు వడ్డీ అయిందని చెప్పి, ఇట్టి రూపాయలు కట్టమని సాయి రెడ్డి ఇంటికి వచ్చారని తెలిపారు. ఆ సమయంలో సాయి రెడ్డి కాలుకు దెబ్బ తగలడంతో కాలు క్యాప్చర్ అయినందున, బ్యాంకుకు వెళ్లలేదని చెప్పారు. ఆయనను బ్యాంకు వారు మళ్ళీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతము సాయి రెడ్డి పొదుపు ఖాతాలోకి రైతుబంధు డబ్బులు వచ్చినవని, ఇప్పుడు తీసుకుందామంటే బ్యాంకు మేనేజర్ నా యొక్క పొదుపు ఖాతా కు లాక్ చేశారని, అంకాపూర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ విజయ్ తో మాట్లాడి డబ్బులు ఇప్పించగలరని కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంకాపూర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ విజయను వివరణ కోరగా గత మూడు సంవత్సరాల నుంచి క్రాప్ లోన్ రెన్యువల్ చేయించుకోనందున ఆటోమేటిగ్గా హెడ్ ఆఫీస్ నుంచి సాయి రెడ్డి పొదుపు ఖాతకు లాక్ పడిందని తెలిపారు. పొదుపు ఖాతాకు లాక్ చేసే అధికారం బ్యాంక్ మేనేజర్ కు లేదని తెలియజేశారు.లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసులు వివరణ కోరగారైతుబంధు డబ్బులకు క్రాప్ లోనుకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు. అంకాపూర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ తో రైతుబంధు డబ్బుల గురించి మాట్లాడి ఇప్పిస్తామన్నారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ ను టెక్నికల్ ఆఫీసర్ తో మాట్లాడి ఒక వన్ వీక్ లో ఇప్పిచ్చే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.
Spread the love