శ్రీలక్ష్మీ రైస్ మిల్లును తరలించాలని రైతు సంఘం డిమాండ్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామపంచాయతీ పరిధిలోని వరి పంట పొలాన్ని రైతు సంఘం నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. సర్వే నెంబర్ 95,96లో బొమ్మిరెడ్డి మల్లారెడ్డి వరి పొలం ప్రక్కనే శ్రీలక్ష్మీ రైస్ మిల్లు నుండి వచ్చే పొట్టు పౌడర్ వల్ల సుమారు నాలుగు ఎకరాల పొలము పూర్తిగా తెల్లబడి వరి గొలుసు పాలు తాగకుండానే ఎండిపోయిందని రైతు సంఘం ఆధ్వర్యంలో పత్రికా విలేకరులతో కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వెల్గ శ్రీధర్ రెడ్డి తడక మోహన్ నేత మాట్లాడుతూ తక్షణమే మిల్లును తరలించాలని డిమాండ్ చేశారు. రైతు బొమ్మిరెడ్డి మల్లారెడ్డి సంబంధిత అధికారుల కు,రైస్ మిల్ యజమానులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని త్రీఆవేదన వ్యక్తం చేశారు. అయినా రైస్ మిల్ యజమానులు రైతును ఇబ్బంది పాలు చేస్తూ ఏమాత్రం కూడా పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయకపోగా రైతును బెదిరించారు.ఇట్టి విషయమై ఈరోజు నేలపట్ల రైతులు ఎలక్ట్రాన్ మీడియా సమక్షంలో వరి పొలాన్ని పూర్తిగా పరిశీలన చేయించి మీడియా ద్వారా సంబంధించి అధికారులు దృష్టికి తేవాలని రైతు బొమ్మ రెడ్డి మల్లారెడ్డి పక్షాన స్థానిక రైతు సంఘం తరఫున కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి రైతుకు ఎకరాకు 50 వేల రూపాయలు చొప్పున నష్టపరివార ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెలగ శ్రీధర్ రెడ్డి,తడక మోహన్ నేత,పబ్బతి పుల్లయ్య,కటిక రాజయ్య,రైతులు పాల్గొన్నారు.

Spread the love