సేఫ్టీ గాలికి…

– హౌటల్స్‌, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం
– రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలతో కలకలం
– షాద్‌నగర్‌లో వెలుగు చూసిన ఘటన
– మండి బిర్యానీ తిని ఒకే కుటుంబంలో 8మందికి అస్వస్థత
– సాయిబాబా రెస్టారెంట్‌లో ఫుడ్‌ సేప్టీ అధికారుల తనిఖీలు
ఏ వ్యాపారానికి అయిన నమ్మకమే పెట్టుబడి. ముఖ్యంగా ఫుడ్‌ వ్యాపారంలో నమ్మకం, టేస్ట్‌ కీలకం. ఒక్కసారి టేస్ట్‌ నచ్చితే ఎంత దూరం ఉన్నా వినియోగదారులు వెళ్లి తింటారు. అయితే ఇప్పుడు ఈ నమ్మకం, టేస్ట్‌లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనం బయట తినే ఫుడ్‌ ఏ మేరకు భద్రమో అర్థం కావడం లేదు. మనం తినే ఆహారం బాగుంటేనే మన అరోగ్యం బాగుంటుంది. తినే ఫుడ్‌ బాగా లేకుంటే ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంటుంది. వివిధ కారణాలతో బయట తినే ఫుడ్‌ ప్రియులకు ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలను చూస్తే కంగు తింటున్నారు. హౌటల్స్‌, రెస్టారెంట్లు, ఇతర చిన్న, చిన్న దుకాణాల్లో కూడా ఫుడ్‌ కల్తీ కావడంతో ఫుడ్‌ ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఎవరూ ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అనేక పే రు మోసిన రెస్టారెంట్లు, హౌటల్స్‌ ఉన్నాయి. ఈ జిల్లాలో ఎక్కువ ప్రాంతం అర్బన్‌ ప్రాంతం. ము ఖ్యంగా హైదరాబాద్‌ నగరానికి దగ్గరగా ఉంటుం ది. దాంతో ఇక్కడ రెస్టారెంట్లు, హౌటల్స్‌ ఎక్కువే. ప్రతిరోజూ రూ.కోట్లలో ఫుడ్‌ వ్యాపారం నడుస్తుం ది. హైదరాబాద్‌ నగరంలో ఉద్యోగాలు చేసే వారు కూడా ఎక్కువగా బయటనే తింటారు. దాంతో పాటు శుభకార్యాలు, ప్రత్యేక రోజులు ఉన్నప్పుడు కూడా చాలా మంది బయట తినడానికే ఇష్టపడతా రు. సామాన్య ప్రజలు సైతం వారంలో ఒక్కరోజు నా వీక్‌ ఎండ్‌ పేరుతో కుటుంబంతో బయటకు వెళ్తారు. ఆ సమ యంలో వారు కూడా ఏదైనా ప్రత్యేక రెస్టారెంట్‌, హౌటల్స్‌లోనే తినడానికి ఇష్టపడతారు. ఇక పార్టీలు చేసుకోవడం, ప్రత్యేక కార్యక్రమాలు సెలబ్రెట్‌ చేసుకోవడం వంటివి కా మన్‌. అలాగే జిల్లాలో ఐటీ ప్రాంతలైన మాదాపూర్‌, హెటెక్‌సిటీ, గచ్చిబౌలి, మియాపూర్‌, శేరిలింగం పల్లి ప్రాంతాల్లో అయితే ఐటీ ఉద్యోగులు మొత్తం బయట ఫుడ్‌ ఎక్కువగా తింటారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా వీరు తింటున్న ఆహారం ఎంత వరకు సేఫ్టీ అనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. పేరుమోసిన రెస్టారెంట్లలో సైతం కల్తీ జరు గుతోంది అన్నది ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలతో తేటతెల్లం అయింది. దాంతో ఇన్నీ రోజులు బయట తిన్న వారి ఆరోగ్య పరిస్థితి ఎంటీ అన్నది ఆగమ్యగోచరంగా మారింది.
అధికారుల తనిఖీలతో వెలుగులోకి వాస్తవాలు
రెస్టారెంట్లు, హౌటల్స్‌లో కల్తీ జరుగుతుం దని గుర్తించిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ముందుగా హైదరాబాద్‌ నగరంలో పెద్ద మొత్తం లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేరుమోసిన పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుంచి చిన్న, చిన్న ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో కూడా కల్తీ జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని వినియోగదారులకు అంటగడుతున్నట్టు గుర్తించా రు. చాలా రోజులుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని గుర్తించిన అధికారులు దాన్ని బయట పడేవేశారు. నిల్వ ఉంచిన ఆహారం తినడం వలన ప్రజల అనా రోగ్యం దెబ్బతింటుంది. నగరంలో చేపట్టిన తనిఖీల తో అసలు విషయాలు బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వివిధ జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో కూడా కల్తీ జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గు ర్తించి, వాటిని పడవేశారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు సైతం నమోదు చేశారు.
షాద్‌నగర్‌లో వెలుగు చూసిన ఘటన..
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలో మండి బిర్యానీ తినడంతో ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. నందిగామ మండల పరిధిలోని అప్ప రెడ్డిగూడా గ్రామానికి చెందిన కావాలి నరేందర్‌ తన పెండ్లి రోజు ఉందని ఈ నెల 22వ తేదీన బు ధవారం రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో షాద్‌నగర్‌ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. తర్వాత ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో శంషాబాద్‌లోని ప్రయివేట్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. అప్పటికే నరేందర్‌కు రక్తపు వాంతులు, విరేచనాలు కావ డంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయ నతోపాటు ఆయన భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు దీక్షిత, తన్విక, అనిరూద్‌, అభిలాష్‌, జోష్ణ, సాయి, శ్రీకర్‌, మొత్తం ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడం వల్లనే ఫుడ్‌ పాయిజన్‌ అయిందని వైద్యులు నిర్ధారించారు.
రెస్టారెంట్‌లో అధికారులు తనిఖీలు
సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌ను మంగళ వారం రంగారెడ్డి జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి ఉద రుకుమార్‌ బృందం తనిఖీలు నిర్వహించింది. సా యిబాబా రెస్టారెంట్‌ను తనిఖీ చేసి వంట సామా గి పరిశుభ్రంగా ఉందా లేదా అని పరిశీలించారు. బిర్యానీ శాంపిల్‌ సేకరించి, స్వాధీనం చేసుకున్నా రు. వంట గది పరిశుభ్రంగా లేకపోవడంతో కేసు నమోదు చేశారు. ఇలా జిల్లాలో పలు చోట్ల ఫుడ్‌ సే ఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కల్తీతోపాటు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఇప్పటికైనా ప్రజలు బయట ఆహారం తినే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Spread the love