మండల పరిధిలోని దేవక్కపల్లి గ్రామంలో ఈ ఏడాది నిర్వహించనున్న సమ్మక్క సారాలమ్మ జాతర నిర్వహణ నూతన కమిటీ సభ్యుల ఎన్నికలు అదివారం ఆలయ ప్రాంగణం వద్ద నిర్వహించారు. కమిటీ చైర్మన్ గా జంగిడి సంజీవ రెడ్డి, వైస్ చైర్మన్ గా రావుల రాజిరెడ్డి, కార్య నిర్వహణ అధ్యక్షుడిగా రావు రంగారెడ్డి, కోశాధికారిగా అటికం సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా జనాగం రాజు ఏకగ్రీవంగా ఎన్నికినట్టు ఛైర్మన్ సంజీవ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 21న సమ్మక్క సారాలమ్మ జాతర ప్రారంభమై 22,23న భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారని సంజీవ రెడ్డి తెలిపారు.