రాత్రి వేళలో ఇసుక డంపులు

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం పరిధిలో దుందుబి నది పరివాహక ప్రాంతాల నుండి ఇసుక అక్రమంగా తరలించవద్దని, స్టాక్ బండ్లు కూడా నడవవద్దు అని స్థానిక ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితం అధికారులు తెలిపారు. కానీ 2,3 రోజుల నుండి దాసర్లపల్లి నడిగడ్డ నుండి ప్రతి రోజు స్టాక్ ఇసుక  డంపు చేస్తున్నారు. పోలీస్ అధికారులు రంగపూర్ జాతరలో డ్యూటీలో ఉన్న క్రమంలో అదే అదునుగా చేసుకొని ఇసుకకు తెరలేపి పెద్దాపురం గ్రామం నుండి ప్రతి రోజు నాలుగు ,ఐదు ట్రాక్టర్లు 40 ట్రిప్పుల ఇసుక  డంపు చేయడం జరుగింది. కనుక రెవెన్యూ అధికారులు దీని మీద శ్రద్ధ వహించి అట్టి ఇసుకను  సీజ్ చేసి ఇసుక మాఫియాను అరికట్టవలసిందిగా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక అధికారులు ఇసుక పైనా నిఘా పెట్టి, అరికట్టవలిసిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫునకోరడం జరిగిందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్త రవీందర్ రావు కోరారు. మీరు పట్టించు కోని యెడల పెద్ద మొత్తంలో ఎమ్మార్వో ఆఫీసును ముట్టడి చేయడం జరుగుతుందన్నారు. తదుపరి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. గతంలో అభివృద్ధి పనుల కొరకు ఇసుక తరలిస్తే మాజీ ఎమ్మెల్యే గారి పైన చాలా నిందలు మోపడం జరిగిందని, ఇప్పుటి స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేను ఇసుక మాఫియా అని అంటున్నావు మరి మీ కార్యకర్తలు చేస్తున్న పని ఏమిటి, మీరు  ఎవ్వరు వచ్చిన మీ కార్యకర్తలు ఇసుక పోసిన డంపులు చూపిస్తాము. మీకు ఇసుకమీద  చిత్త శుద్ది ఉంటే, ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అక్రమ రవాణా ఇసుకను ఆపాలని,  లేకపోతే ఇందులో మీ పాత్ర ఉంది అనడంలో ఏమాత్రము సందేహం లేదు అని అన్నారు. మీరు గెలిచి నెల 15 రోజులు కాలేదు అప్పుడే ఏమి అభివృద్ధి పనులు వచ్చాయని ఇసుక మాఫియా కు తెర లేపారి, పరివాహాక ప్రాంతంలోని ప్రజలు చర్చించుకోవడం జరుగుతుంది అన్నారు. మండల బీఆర్ఎస్ పార్టీ తరుపున  ఆందోళన చేయడం జరుగుతుంది ఒక ప్రకటనలో తెలిపారు.
Spread the love