
నవతెలంగాణ – వేములవాడ
రానున్న మహాశివరాత్రి జాతరకు పారిశుద్ధ్యం లోపించకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లుగా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తెలిపారు. మంగళవారం వేములవాడ రాజన్న ఆలయ అధికారులతో కలిసి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీలను మున్సిపల్ కమిషనర్ జీ.అన్వేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో పారిశుధ్య లోపించకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఆయన తెలిపారు. దుకాణ యజమాన నిర్వాహకులు చెత్తను మురికి కారువలో పడేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజు వచ్చే చెత్త బండ్లకు చెత్తని అందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణ, ఏఈఓ అశోక్, సానిటేషన్ పర్యవేక్షకులు వారి నరసయ్య, ఎంక్వైరీ ఆఫీస్ పరివేక్షకులు శ్రీకాంతచారి, ఆలయ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.