తెలుగువారందరికీ సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైనది

– జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావు.
నవతెలంగాణ – తుంగతుర్తి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి పండుగ ఎంతో ప్రత్యేకమైనదని, పండుగ సందర్భంగా లోగిళ్లను అందంగా ముస్తాబు చేయడంలో తెలుగింటి ఆడపడుచులది అందేవేసిన చేయని, మన సాంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావు అన్నారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులు ప్రధానం చేసి మాట్లాడారు.ఈ మేరకు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని,వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకే ముగ్గుల పోటీలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా పక్షపాతి అని, మహిళల పేరు మీద ఎన్నో పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగిస్తే, కుటుంబాలు బాగుంటాయన్న దూరదృష్టితో ఆలోచించి వారికి అండగా నిలుస్తున్నారన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే పల్లె పండుగ అని, ఎంత దూరమెల్లిన, ఎంత ఎత్తుకు ఎదిగినా, సొంతూరికి రప్పించే పండుగ సంక్రాంతి అన్నారు. కొత్త ధాన్యాలతో, కొత్త అల్లుళ్లతో ఆహ్లాదకరంగా జరుపుకునే పల్లెటూరు పండుగ సంక్రాంతి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కిషన్ రావు,మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ అధినేత తిరుమలప్రగడ రాహుల్,సీనియర్ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగరాజు,పట్టణ అధ్యక్షులు రాంబాబు కాలనీ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love