కాంతి లేని సంక్రాంతి..?

– పెరిగిన నిత్యావసర ధరలు

 – ఉచిత బియ్యం 5కీలోలే.
నవ తెలంగాణ – మల్హర్ రావు
సంక్రాంతి పండుగ వచ్చిoదంటే ఏ ఇంట్లో చూసిన పిండి వంటలు ఘుమఘుమలే ఉంటాయి.వారం ముందునుంచే సకినాలు,గ్యారేలు,కారపూస,లడ్డులు,అరిసెలు ఇలా రకరకాలు పేదోళ్ళు మొదలు ఉన్నత కుటుంబాల వరకు తమ ఇంట్లో చేసుకొంటారు. వీటికి దొడ్డు బియ్యమే వాడతారు.సాధారణంగా పండగపూట ప్రభుత్వాలు సబ్సిడీపై  పంపిణీ చేసే నిత్యావసర సరుకులు అదనంగా అందిస్తాయి.కానీ ప్రభుత్వం అందించే బియ్యంలో కోత విధించి ఒక యూనిట్ కు ఐదు కిలోలు మాత్రమే పంపిణీ చేశారు.అవికూడా సకాలంలో ఇవ్వలేదు.ఇందుకు తోడుగా నిత్యావసర సరుకులైన నూనెలు,పప్పులు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటడంతో పల్లెల్లో సంక్రాంతిశోభ కనిపించడం లేదు.మూడు రోజులపాటు జరుపుకునే సంక్రాంతి సంబరాల సందడి అంతంతామాత్రంగానే జరుపుతున్నారు.భోగి, సంక్రాంతి,కనుమ మూడు రోజుల పండగ సంబరాల్లో చిన్నారులు ఎగురించే పంతంగులు, హరిదాసుల కీర్తనలు,గంగిరెద్దుల విన్యాసాలు పల్లెల్లో ఎక్కడ కారాలేదు.
Spread the love