– ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన జీఎం సరికొండ
నవతెలంగాణ – సత్తుపల్లి
సింగరేణి సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్‌గా సరికొండ వెంకటాచారి నియమితులయ్యారు. ఈ మేరకు జీఎంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వెంకటాచారి ఆదివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌ను ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ మాట్లాడుతూ… సింగరేణి సత్తుపల్లి ఏరియా అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమంతో పాటు సత్తుపల్లి నియోజకవర్గానికి సింగరేణి సంస్థ ద్వారా అందే పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సహకరించాలని జీఎం వెంకటాచారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం బొల్లం శ్రీనివాస్, జేవీఆర్-ఓసీ, కిష్టారం-ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఎన్వీఆర్ ప్రహ్లాద్, సునీల్ వర్మ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. జీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంకటాచారి ఇంతకు ముందు సత్తుపల్లి జేవీఆర్-ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసి ఉద్యోగోన్నతిపై బదిలీ అయ్యారు. ప్రస్తుతం జీఎంగా ఉద్యోగోన్నతి పొంది సత్తుపల్లికి బదిలీపై వచ్చారు.
సింగరేణి సత్తుపల్లి ఏరియా జీఎంగా ‘సరికొండ వెంకటాచారి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



